హైదరాబాద్, అక్టోబర్ 12: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జీఎమ్మార్ ఏవియేషన్ అకాడమీ (జీఎమ్మార్ఏఏ) ఒక వినూత్న సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనాలిసిస్ సెంటర్ (ఐఎస్ఏసీ)తో కలిసి ఏవియేషన్ సైబర్ సెక్యూరిటీ ఫిజిటల్ ల్యాబ్‌ను ప్రారంభించినట్టు జీఎమ్మార్ఏఏ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫిజిటల్ ల్యాబ్ అభివృద్ధికి 10,000 చదరపు అడుగుల స్పేస్‌ను కేటాయించామని, ల్యాబ్‌కు టెక్నాలజీ పార్టనర్‌గా సైబర్రేంజ్, నాలెడ్జ్ పార్టనర్‌గా ఐఎస్ఏసీ వ్యవహరిస్తున్నట్టు జీఎమ్మార్ వివరించింది. సైబర్ సెక్యూరిటీ వృత్తినిపుణులకు, ఫ్రెషర్లను సమగ్ర శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నది. క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (సీఐఐ)ను సైబర్ దాడుల నుంచి పరిరక్షించే శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నది.