Gmail : గూగుల్ తన ఈమెయిల్ సర్వీస్‌కు పూర్తిగా ఏఐ ఫీచర్లను జోడించనుంది. ఉత్పాదకత పెంచడం, సర్వీసుల క్రమబద్ధీకరణను మెరుగుపరిచేందుకు టెక్ దిగ్గజం సెర్చ్ నుంచి వర్క్‌స్పేస్ వరకూ ఏఐని వినియోగిస్తోంది. ఈ దిశగా అండ్రాయిడ్ యూజర్లకు ఏఐ వినియోగిస్తూ ఈమెయిల్ కమ్యూనికేషన్‌ను మెరుగుపరిచేక్రమంలో న్యూ జీమెయిల్ యాప్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.
రిప్లయ్ సజెషన్స్ ఫ్రం జెమిని పేరిట వ్యవహరిస్తున్న ఈ ఫీచర్ గూగుల్ ఏఐ మోడల్ జెమినిని వాడుతూ ఇన్కమింగ్ ఈమెయిల్స్‌కు ఆటోమేటిక్‌గా రెస్పాన్స్ సజెషన్స్ అందిస్తుంది. కానీ ఈమెయిల్ సంభాషణల భవిష్యత్తును ఈ ఫీచర్ సమూలంగా మార్చివేస్తుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత జెమిని అందుకునే ఈ మెయిల్ కంటెంట్‌ను ఇది విశ్లేషించి ఆపై వినియోగదారులకు సందర్భానుసారంగా సంబంధిత మూడు ప్రత్యుత్తర ఎంపికలను సూచిస్తుంది.
ఈ ఏఐ ఫీచర్ రూపొందించిన ప్రతిస్పందనలు చిన్న పదబంధాల నుండి పూర్తి వాక్యాల వరకు ఉంటాయి. ఈ-మెయిల్ రిప్లయ్‌లను రాయడంతో వినియోగదారులకు విలువై సమయం, శ్రమను ఆదా చేసే అవకాశం ఉంది.ఈ ఫీచర్ ఉత్పాదకత అనేది దీని వినియోగంపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఒక ట్యాప్ ద్వారా యూజర్లు కంపోజ్ ఫీల్డ్‌లో చూపే రిప్లయ్ సజెషన్స్ నుంచి తమకు కావాల్సిన వాటిని యూజర్లు ఎంపిక చేసుకోవచ్చు. దీన్ని పంపే ముందుగా మెసేజ్‌ను కస్టమైజ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
Read More :
KCR | రంగదాంపల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఘనస్వాగతం