న్యూఢిల్లీ, జనవరి 26: దేశీయంగా కార్యాలయ స్థలాల లీజింగ్‌లో అంతర్జాతీయ కంపెనీలదే హవా. జేఎల్ఎల్ ఇండియా తాజా వివరాల ప్రకారం.. గత ఏడాది దేశంలోని 7 ప్రధాన నగరాల ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో 58 శాతం వాటా గ్లోబల్ సంస్థలదే అని తేలింది.
2025లో 8 శాతం ఎగిసి మొత్తంగా 83.3 మిలియన్ చదరపు అడుగులకు ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది. 2024లో 77.2 మిలియన్ చదరపు అడుగులుగానే ఉన్నది. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ-ఎన్సీఆర్, పుణె, ముంబై, బెంగళూరులలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ తీరుతెన్నులపై జేఎల్ఎల్ ఈ నివేదికను విడుదల చేసింది. ఇక విదేశీ సంస్థల తొలి ప్రాధాన్యం బెంగళూరుకేనని జేఎల్ఎల్ పేర్కొన్నది. ఎక్కువగా జీసీసీలను ఏర్పాటు చేస్తున్నాయి.