హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎస్ఆర్నగర్లో 44,359.66 చదరపు గజాల భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లించకపోవడంపై అధికారులు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఆగస్టు 3న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని హెదరాబాద్ జిల్లా గత కలెక్టర్ అమోయ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, భూసేకరణ అధికారి వెంకటేశ్వర్లుకు స్పష్టం చేసింది.
మురికివాడ కోసం బాపూనగర్లోని 58, 59, 60 సర్వే నంబర్లలో సేకరించిన ఆ భూముల యజమానులకు పరిహారం చెల్లించాలన్న ఉత్తర్వులు అమలు కాలేదని పిటిషన్ దాఖలవడం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.