RBI | కార్డుల ఎంపికలో కస్టమర్లకు స్వేచ్ఛనివ్వండి.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం
క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కొత్తగా జారీచేసే సమయంలో అర్హత ఉన్న కస్టమర్లకు వారికి నచ్చిన నెట్వర్క్ నుంచే సదరు కార్డులను ఎంచుకునే అవకాశం కల్పించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది.
RBI | ముంబై, మార్చి 6: క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను కొత్తగా జారీచేసే సమయంలో అర్హత ఉన్న కస్టమర్లకు వారికి నచ్చిన నెట్వర్క్ నుంచే సదరు కార్డులను ఎంచుకునే అవకాశం కల్పించాలని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. అలాగే ఇప్పటికే ఉన్న ఖాతాదారులకూ కార్డు రెన్యువల్ చేసేటప్పుడు ఈ సౌకర్యాన్నివ్వాలని స్పష్టం చేసింది. కాగా, క్రెడిట్ కార్డుల్ని జారీచేసే సంస్థలు కార్డ్ నెట్వర్క్స్తో ఏ రకమైన ఒప్పందాలు చేసుకోరాదని కూడా ఆర్బీఐ తాజా సర్క్యులర్‌లో తెలిపింది.
దీనివల్ల కస్టమర్లు వారికి నచ్చిన నెట్‌వర్క్స్‌ను ఎంచుకునే అవకాశం లేకుండా పోతుందని చెప్పింది. ఆర్బీఐ నిర్ణయంతో ఆయా కార్డుల ప్రయోజనాలు కస్టమర్లకు విస్తృత రీతిలో అందనున్నాయి. ఇదిలావుంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆంక్షల నేపథ్యంలో 80-85 శాతం పేటీఎం వ్యాలెట్ వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తడం లేదని, మిగిలినవారూ ఇతర బ్యాంకులతో లింక్ చేసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

