ముంబై, ఏప్రిల్ 27: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానీయా ఆధ్వర్యంలో నడుస్తున్న రేమండ్ కన్జ్యూమర్ కేర్ వ్యాపారం నుంచి వైదొలిగింది. ఈ విభాగాన్ని గోద్రేజ్ గ్రూపు కొనుగోలు చేసింది. కామసూత్ర, ప్రీమియం పేర్లతో కండోమ్‌లతోపాటు పార్క్ అవెన్యూ, డీఎస్ డియోడ్రెంట్లు ఇక గోద్రేజ్ గ్రూపు వశం కానున్నాయి.
పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పం దం విలువ రూ.2,825 కోట్లు. అయినప్పటికీ రేమండ్ గ్రూపు ఈ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంతోపాటు బీ2బీ కన్జ్యూమర్, ఎగుమతి చేయనున్నది కూడా. గోద్రేజ్ కన్జ్యూమర్ కేర్ బ్రాండ్‌కు కాంట్రాక్ట్ తయారీదారుగా వ్యవహరించనున్నది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందం 12-14 నెలల్లో పూర్తికానున్నది.