ముంబై, జూలై 31 : దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నిరాశాజనక పనితీరు కనబరుస్తున్నది. ప్రస్తుతం సంవత్సరంలో ఇప్పటి వరకు గౌతమ్ అదానీ రియల్ ఎస్టేట్ సంపద 7 శాతం తగ్గి రూ.52,320 కోట్లకు పరిమితమైంది. అయినప్పటికీ ఈ రంగంలో మూడో అతిపెద్ద వ్యాపారిగా కొనసగుతున్నారు. డీఎల్ఎఫ్ చీఫ్ రాజీవ్ సింగ్.. దేశీయ హురున్ ఇండియా రియల్ ఎస్టేట్ 150 జాబితాలో రూ.1.27 లక్షల కోట్ల సంపదతో తొలి స్థానంలో కొనసాగుతున్నారు.
ఆ తర్వాతి స్థానంలో బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి మంగల్ ప్రభాత్ లోధా రూ.92,340 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో లిస్ట్కానీ అత్యంత విలువైన సంస్తల్లో అదానీ రియల్టీ ఒకరు. గడిచిన ఏడాదికాలంలో డీఎల్ఎఫ్ సింగ్ సంపద ఒక్క శాతం వరకు పెరగగా, లోధా సంపద కేవలం 1 శాతం అధికమైంది. ప్రస్తుత సంవత్సరంలో 150 కంపెనీల నికర సంపద 14 శాతం వృద్ధిని పెరిగింది.