Adani-Ambani | అదానీ.. అంబానీల వ్యక్తిగత సంపద భారీ నష్టం.. ఎంతంటే?!
Adani-Ambani | గౌతం అదానీ, ముకేశ్ అంబానీ ఈ ఏడాది భారీగా వ్యక్తిగత సంపద కోల్పోయారు. అంబానీ వ్యక్తిగత సంపద 81.5 బిలియన్ డాలర్లు కాగా, గౌతం అదానీ పర్సనల్ వెల్త్ 42.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.
Adani-Ambani | భారత పారిశ్రామికవేత్తల్లో కార్పొరేట్ దిగ్గజాలు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ ఈ ఏడాది గరిష్టంగా వ్యక్తిగత సంపద కోల్పోయిన కుబేరులు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సూచీ ప్రకారం గౌతం అదానీ వ్యక్తిగత సంపద 78 బిలియన్ డాలర్లకు పైగా ఆవిరై పోయింది. మరోవైపు ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 500 కోట్ల డాలర్లకు పై చిలుకు నష్టపోయాయరు.
ఈ నెల ప్రారంభంలో ప్రపంచంలోకెల్లా ఇండియన్ బిలియనీర్ హోదాను ముకేశ్ అంబానీ తిరిగి పొందారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 81.5 బిలియన్ డాలర్లు. ఈ నెల 23 సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో కొనసాగుతున్నారు. మరోవైపు గౌతం అదానీ వ్యక్తిగత సంపద 42.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. గతేడాది ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో కొనసాగిన గౌతం అదానీ ఇప్పుడు 29వ ర్యాంక్‌కు పడిపోయారు. టాప్-25 బిలియనీర్స్ జాబితాలోకి గౌతం అదానీ ఇప్పట్లో వచ్చే సంకేతాలు కనిపించడం లేదు.
అదానీ గ్రూప్ కంపెనీల ఖాతాల్లో అవకతవకలు జరిగాయని, స్టాక్ మార్కెట్లో మోసాలకు పాల్పడ్డారని యూఎస్ షార్ట్ షెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక బయటపెట్టినప్పటి నుంచి అదానీ సంస్థల షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. గత నెల 24 నుంచి అదానీ స్టాక్స్ పతనం అవుతూనే ఉన్నాయి. హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారం అని అదానీ గ్రూప్ పేర్కొనా.. ఆ సంస్థల షేర్లను ఇన్వెస్టర్లు విక్రయిస్తూనే ఉన్నారు. ఫలితంగా గౌతం అదానీ వ్యక్తిగత సంపదలో గణనీయ భాగం కోల్పోయారు.
దేశంలోనే అతిపెద్ద పోర్ట్‌ను అదానీ గ్రూప్ నడుపుతున్నది. థర్మల్ విద్యుత్ కేంద్రాలను నడపడంతోపాటు అతిపెద్ద బొగ్గు వ్యాపార సంస్థగా అదానీ గ్రూప్ నిలిచింది. మౌలిక వసతుల రంగంలో వ్యాపార లావాదేవీలు నడుపుతున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

