న్యూఢిల్లీ, జనవరి 23: దేశీయ కుబేరుడు గౌతమ్ అదానీ మరో మీడియా సంస్థను చేజిక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్డీటీవీని హస్తగతం చేసుకున్న ఆయన..తాజాగా ఐఏఎన్ఎస్లో మిగతా వాటాను కూడా కొనుగోలు చేశారు. ఆర్థిక వివరాలు వెల్లడించలేదు. అదానీ ఎంటర్ప్రైజెస్ గ్రూపునకు చెందిన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్ ఈ కొనుగోలు జరిపింది. డిసెంబర్ 2023లో ఐఏఎన్ఎస్లో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిన ఏఎంజీ..జనవరి 2024లో తన వాటాను 50.5 శాతం నుంచి 76 శాతానికి పెంచుకున్నది. ఇక మిగతా 24 శాతం వాటా ను ఈ నెల 21న కొనుగోలు చేసింది.