ముంబై, ఫిబ్రవరి 17: దేశీయ స్టాక్ మార్కెట్లోకి మరో సంస్థ అడుగుపెట్టబోతున్నది. ఫెర్టిలిటీ సేవల సంస్థ గౌడియం ఐవీఎఫ్ అండ్ మహిళా హెల్త్ లిమిటెడ్..ఐపీవో ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేరు ధరల శ్రేణిని రూ.75-79 గా నిర్ణయించింది.
ఈ నెల 20న ప్రారంభంకానున్న వాటాల విక్రయం ఈ నెల 24న ముగియనున్నది. రెండు శాతానికి సమానమైన షేర్లను బహిరంగా మార్కెట్లో విక్రయించడం ద్వారా సంస్థకు రూ.165 కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఫెర్టిలిటీ విభాగం నుంచి వస్తున్న తొలి ఐపీవో సంస్థ ఇదే కావడం విశేషం.