Funds Reduced for Startups | స్టార్టప్‌ల్లోకి వచ్చే పెడుబడులు భారీగా తగ్గాయి. ప్రస్తుత సంవత్సరం రెండో త్రైమాసికంలో స్టార్టప్‌ల్లోకి 6 బిలియన్ డాలర్లు(రూ.47,800 కోట్లు) పెట్టుబడులు వచ్చాయని ఐటీ రంగ బాడీ నాస్కాం వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఇది 17 శాతం తక్కువ. ప్రతి త్రైమాసికంలో స్టార్టప్‌ల్లోకి వచ్చే పెట్టుబడుల వివరాలను పీజీఏ ల్యాబ్స్‌తో కలిసి నాస్కాం విడుదల చేస్తున్నది.
స్టార్టప్ మార్కెట్లో సెంటిమెంట్ నిరుత్సాహంగా ఉండటంతో ఒప్పందాలు తగ్గుముఖం పట్టినప్పటికీ నిధులు మాత్రం పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వచ్చిన 6 బిలియన్ డాలర్ల ఫండింగ్‌లో 16 అతిపెద్ద ఒప్పందాలు ఉన్నాయని వెల్లడించింది. వీటిలో రెండు నూతన యూనికార్న్ స్టార్టప్‌లుగా అవతరించాయని తెలిపింది. దీంతో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 20 యూనికార్న్ స్టార్టప్‌లుగా అవతరించినట్లు తెలిపింది.