హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ): సౌర విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఫ్రెయర్ ఎనర్జీకి రూ.58 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు సహ వ్యవస్థాపకులు రాధిక, సౌరభ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధుల సమీకరణతో తమ వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.
సోలార్ విద్యుత్తు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ మరింత విస్తరణకు అవసరమైన పెట్టుబడులు ఈక్విటి కంపెనీల నుంచి వచ్చాయని వివరించారు. ఇందులో ఈడీఎఫ్ ఎలక్ట్రిఫై, షిండర్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏసియా, మేబ్రైట్, వీటీ క్యాపిటల్ కంపెనీలు కలిసి మొత్తం రూ.58 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నాయని వారు తెలిపారు.