హైదరాబాద్: గతకొన్ని నెలలుగా వంటనూనెల ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డి తెలిపారు. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యా దేశాల నుంచి ప్రధానంగా దిగుమతి చేసుకోవాల్సి వస్తుందన్న ఆయన.. దిగుమతి సుంకాల భారం తగ్గడంతో దేశీయ మార్కెట్లో ధరలూ దిగివచ్చాయని చెప్పారు.