హైదరాబాద్, జూలై 29: ఫ్రీడమ్ వంటనూనెల సంస్థ తన వినియోగదారుల కోసం కోత్త ఫ్రీడమ్ క్యాచ్ ద మసాలా’ ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా లీటర్ రిఫైన్స్ సన్‌ఫ్లవర్ ఆయిల్ బాటిల్/పౌచ్ కొనుగోలు చేసిన వారికి రూ.10 విలువైన ఒకటి క్యాచ్ గరం మసాలా ప్యాక్‌ను ఉచితంగా అందిస్తున్నది.
ఈ సందర్భంగా ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ..కొత్త ఫ్రీడమ్ క్యాచ్ ద మసాల ఆఫర్‌ను తీసుకోస్తుండటం చాలా సంతోషంగా ఉన్నది, ప్రతి లీటర్(పౌచ్/బాటిల్)పై రిఫైన్స్ సన్ ప్లవర్ ఆయిల్‌పై ప్యాకెట్ గరం మసాలాను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.