FPI Investments | కేంద్రంలో వరుసగా మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం కొలువు దీరడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోంది. ప్రత్యేకించి విదేశీ ఫోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. ఈ నెల తొలి వారంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.7,900 కోట్లకు పైగా షేర్లలో పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు రూ.1.16 లక్షల కోటలకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2024-25) బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 22న పార్లమెంటుకు సమర్పించనుండటం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు సుస్థిరంగా ఉండటం సానుకూల పరిణామం అని నిపుణులు చెబుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు ముందు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించిన విదేశీ ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలోనే తిరిగి పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నెల ఐదో తేదీ వరకూ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు నికరంగా రూ.7,962 కోట్ల పెట్టుబడులు పెట్టారు. గత నెలలో రూ.26,565 కోట్ల విలువైన ఎఫ్‌పీఐ పెట్టుబడులు గమనార్హం. అంతకుముందు మే నెలలో రూ.25,586 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.8,700 కోట్ల విలువైన పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు.
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
Ayushman Bharat | రూ. 10 లక్షల వరకూ ఆయుష్మాన్ భారత్ లిమిట్..?!
Ola Cabs – Ola Maps | గూగుల్ మ్యాప్స్‌కు బైబై.. ఇక ఓలా మ్యాప్స్ పైనే క్యాబ్ రైడింగ్.. ఎందుకంటే..?!
iPhone 14 Plus | ఐ-ఫోన్ 14 ప్లస్ కావాలా.. రూ.23 వేల వరకూ ఆదా చేయొచ్చు..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!