FPIs | న్యూఢిల్లీ, మే 1: వరుసగా రెండు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా నిధులు చొప్పించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏప్రిల్ నెలలో మాత్రం రూ.8,700 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అమెరికా బాండ్ ఈల్డ్ రేట్లు భారీగా పెరగడం ఇందుకు కారణం. మార్చి నెలలో నికరంగా రూ.35 వేల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్ఐఐలు..ఆ తర్వాతి నెలలో మాత్రం భారీగా వెనక్కి తీసుకున్నారు. మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీ మార్కెట్లోకి రూ.2,222 కోట్లు, డెబిట్ మార్కెట్లలోకి రూ.44,908 కోట్ల పెట్టుబడులు పెట్టారు.
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెండు రోజులపాటు ఇక్కడ జరిగిన ఫెడరల్ ఒపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్వోఎంసీ) సమావేశమై వడ్డీరేట్లను యథాతథంగా 5.25 శాతం నుంచి 5.50 శాతంగా ఉంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో వడ్డీరేట్లు యథాతథంగా ఉండటం ఇది ఆరోసారి.