Foxconn | ఐఫోన్లు (iPhone plant) సహా వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ తైవాన్ సంస్థ ఫాక్స్‌కాన్ (Foxconn) భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన తన కొత్త యూనిట్లో కేవలం 8-9 నెలల్లో దాదాపు 30,000 మంది కార్మికులను నియమించుకుంది. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండటం విశేషం.
బెంగళూరు సమీపంలోని దేవనహళ్లి (Devanahalli)లో ఫాక్స్‌కాన్ దేశంలోనే రెండో అతిపెద్ద ఐఫోన్ తయారీ యూనిట్ (iPhone Assembly Unit)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 300 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీలో ఏప్రిల్-మే నెలల్లో ఐఫోన్ 16 మోడల్‌ను ఉత్పత్తి చేయగా.. ఇప్పుడు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్స్ తయారీని ప్రారంభించారు. ఇక్కడ ఉత్పత్తి చేస్తోన్న ఐఫోన్లలో 80శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఫ్యాక్టరీలో ఇప్పుడు నియామకాలను భారీగా పెంచారు. మొత్తం సిబ్బందిలో 80 శాతం మంది మహిళలే ఉండటం విశేషం. ఇందులో పనిచేసే కార్మికులకు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తోంది సంస్థ. కార్మికులు నెలకు సగటున రూ.18 వేల జీతం పొందుతున్నారు.
వచ్చే ఏడాది నాటికి ఈ యూనిట్లో మొత్తం సిబ్బందిని 50 వేలకు పెంచాలని ఫాక్స్‌కాన్ భావిస్తోంది. ఇక కార్మికుల కోసం సంస్థ ప్లాంట్ ప్రాంగణంలోనే అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. కార్మికుల కోసం ఆరు పెద్ద డార్మిటరీలను నిర్మించింది. అదనపు సౌకర్యాలు కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. కేవలం ఫ్యాక్టరీగానే కాకుండా ఈ ప్లాంట్ భవిష్యత్తులో ఒక మినీ టౌన్‌షిప్‌లా మారనుందని అంచనా. ఇందులో నివాస సముదాయాలు, ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, వినోద సౌకర్యాలను అభివృద్ధి చేసేలా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Also Read..
Mohan Bhagwat | భారత్ హిందూ దేశం.. రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు : మోహన్ భగవత్
H-1B Visa | అపాయింట్మెంట్లు వాయిదా.. భారత్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది H-1B వీసాదారులు
Air India | విమానంలో జీరోకి పడిపోయిన ఇంజిన్ ఆయిల్ ప్రెజర్.. ప్రయాణికుల్లో టెన్షన్ టెన్షన్..