ముంబై, మే 5 : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడం, క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో సెన్సెక్స్ నాలుగు నెలల గరిష్ఠ స్థాయిని తాకింది. వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు సోమవారం కూడా మరింత పెరిగాయి. ఇంట్రాడేలో 500 పాయింట్లకు పైగా లాభపడి 81 వేల పాయింట్ల పైకి చేరుకున్న సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 294.85 పాయింట్లు అందుకొని 80,796.84 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు ఎగబాకి 24,461.15 వద్ద స్థిరపడింది. ఇరు సూచీలు 2025 గరిష్ఠ స్థాయికి ఎగబాకాయి.