Forex Reserves | ముంబై, ఫిబ్రవరి 9: విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 5.736 బిలియన్ డాలర్లు పెరిగి 622.469 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం వారంలోనూ రిజర్వులు 591 మిలియన్ డాలర్లు అధికమైన విషయం తెలిసిందే.
విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 5.186 బిలియన్ డాలర్లు పెరగడం ఇందుకు కారణమని రిజర్వుబ్యాంక్ విశ్లేషించింది. అలాగే పసిడి రిజర్వులు 608 మిలియన్ డాలర్లు అధికమై 48.088 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తెలిపింది.