Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు తిరిగి పెరిగాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.546 బిలియన్ డాలర్లు పెరిగి 674.664 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. ఆగస్టు తొమ్మిదో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు పతనమై 670.119 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఈ నెల రెండో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 674.919 బిలియన్ డాలర్లతో ఆల్ టైం గరిష్టానికి చేరాయి.
ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో కీలకమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ 3.609 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 591.569 బిలియన్ డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. బంగారం రిజర్వు నిల్వలు 865 మిలియన్ డాలర్లు పెరిగి 60.104 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 60 మిలియన్ డాలర్లు వృద్ధి చెంది 18.341 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ లో భారత్ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 12 మిలియన్ డాలర్లు పెరిగి 4.65 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది.