ముంబై, సెప్టెంబర్ 8: గత కొన్ని వారాలుగా తగ్గుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పెరిగాయి. సెప్టెంబర్ 1తో ముగిసిన వారాంతకానికిగాను ఫారెక్స్ రిజర్వులు 4.039 బిలియన్ డాలర్లు పెరిగి 598.897 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం వారంలో రిజర్వులు స్వల్పంగా 30 మిలయన్ డాలర్లు పెరిగి 504.858 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
అక్టోబర్ 2021లో ఫారెక్స్ రిజర్వులు రికార్డు స్థాయి 645 బిలియన్ డాలర్లకు చేరుకున్న విష యం తెలిసిందే. గత వారంలో ఫారెక్స్ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తులు విలువ 3.442 బిలియన్ డాలర్లు పెరిగి 530.691 బిలియన్ డాలర్లకు చేరుకుగా..అలాగే పసిడి రిజర్వులు 584 మిలియన్ డాలర్లు ఎగబాకి 44.939 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.