Mukesh Ambani | భారత్‌తోపాటు ఆసియాలోనే కుబేరుడిగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నిలిచారు. 2024-ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 83 బిలియన్ డాలర్ల నుంచి 116 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఆయన ఒక్కరే 100 బిలియన్ల డాలర్ల క్లబ్లో చోటు దక్కించుకున్నారు. గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఏడాది కాలంలో భారత్ కుబేరుల సంఖ్య 169 నుంచి 200 మందికి చేరుకున్నది. గతేడాదితో పోలిస్తే బిలియనీర్ల వ్యక్తిగత సంపద 675 బిలియన్ డాలర్ల నుంచి 41 శాతం పుంజుకుని 954 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లింది.
ముకేశ్ అంబానీ తర్వాతీ స్థానంలో నిలిచిన అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద 84 బిలియన్ డాలర్లు. ఏడాదిలో 36.8 బిలియన్ డాలర్ల సంపద పెంచుకుని గ్లోబల్ బిలియనీర్లలో 17వ ర్యాంకులో కొనసాగుతున్నారు. ఇక భారతీయ మహిళల్లో 33.5 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో, భారత్ కుబేరుల్లో నాలుగో స్థానంలో ఉన్నారు.కొత్త భారత్ కుబేరుల జాబితాలోకి నరేశ్ త్రిహాన్, రమేశ్ కన్హికనన్, రేణుకా జాగ్తియానీ చేరితే, బైజూ రవీంద్రన్, రోహికా మిస్త్రీ పేర్లు మాయం అయ్యాయి.
ముకేశ్ అంబానీ – 116 బిలియన్ డాలర్లు
గౌతం అదానీ – 84 బిలియన్ డాలర్లు
శివ నాడార్ – 36.9 బిలియన్ డాలర్లు
సావిత్రి జిందాల్ – 33.5 బిలియన్ డాలర్లు
దిలిప్ షాంఘ్వి – 26.7 బిలియన్ డాలర్లు
సైరస్ పూనావాలా – 21.3 బిలియన్ డాలర్లు
కుషాల్ పాల్ సింగ్ – 20.9 బిలియన్ డాలర్లు
కుమార్ బిర్లా – 19.7 బిలియన్ డాలర్లు
రాధాకిషన్ దమానీ – 17.6 బిలియన్ డాలర్లు
లక్ష్మీ మిట్టల్ – 16.4 బిలియన్ డాలర్లు