బెంగళూర్ : ప్రయాణీకులకు నిరాటంక సేవలను, మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు బెంగళూర్‌లోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయం టెర్మినల్స్‌లో రోబోలతో ట్రయల్స్ నిర్వహిస్తోంది. ప్రయాణీకులతో మాట్లాడి వారి ప్రశ్నలకు సమాధానం చెప్పేలా టెమి రోబోట్ అలియాస్ స్కైని డిజైన్ చేశారు.
ప్రస్తుతం ఇవి కొన్ని ప్రయోగ దశలో ఉండగా అలాంటి పది రోబోలను ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ వద్ద ప్రవేశపెట్టారు. వీడియోలో స్కై ప్రయాణీకుల ప్రశ్నలకు బదులిస్తూ కనిపించింది. అదృశ్యమైన తన బ్యాగేజ్‌ను ఎలా గుర్తించాలన్న ప్రయాణీకుడి ప్రశ్నకు రోబో గైడ్ చేస్తున్న తీరు ఆకట్టుకుంది.
బ్యాగేజ్ ఎక్కడ అందుబాటులో ఉంది..టాయ్ షాప్ ఎక్కడ ఉంది..రెస్ట్రూమ్ ఎక్కడ ఉంది..కేఎఫ్‌సీ లొకేషన్ వివరాలు వంటి పలు ప్రశ్నలకు రోబోలు సమాధానం ఇస్తాయి. ఎయిర్పోర్ట్ అంతటా ప్రయాణీకులు కలియతిరిగేందుకు అవసరమైన సమాచారం ఇవి అందిస్తాయి. టెమి రోబోట్ స్కై ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూ ప్రయాణీకులు పిలవగానే ఆగి వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా వీటిని డిజైన్ చేశారు.