Bad Bank : బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
Bad Bank : బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం రూ.30,600 కోట్ల ప్రభుత్వ హామీని ఆమోదించారు. మొండి బకాయిల సంక్షోభం నుంచి ...

న్యూఢిల్లీ : బ్యాడ్ బ్యాంక్ (Bad Bank) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు కోసం రూ.30,600 కోట్ల ప్రభుత్వ హామీని ఆమోదించారు. మొండి బకాయిల సంక్షోభం నుంచి బ్యాంకులు తట్టుకొని నిలిచేందుకు ఈ బ్యాడ్ బ్యాంకును ఏర్పాటుచేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌సీఎల్).. ముద్దుగా బ్యాడ్ బ్యాంకుగా పిలుచుకునే ఈ బ్యాంక్ జారీ చేసే సెక్యూరిటీ రసీదుల కోసం రూ.30,600 కోట్ల వరకు ప్రభుత్వ గ్యారెంటీని ఆమోదించినట్లు ప్రకటించారు. ఈ హామీ ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది. తొలి దశలో ఎన్ఆర్సీఎల్కు బదిలీ చేసే రూ.89, 000 కోట్ల 22 బ్యాండ్ లోన్ ఖాతాలను బ్యాంకులు గుర్తించాయి. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్ రూ.500 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తులను మాత్రమే పరిష్కరించేందుకు తీసుకుంటుంది.
నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ కోసం ప్రభుత్వ హామీని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. అంతకుముందు, నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ప్రసంగంలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు గురించి వెల్లడించారు. బ్యాడ్ బ్యాంకు ప్రారంభంలో హామీ మొత్తం గరిష్టంగా రూ.31,000 కోట్లుగా నిర్ణయించారు. ఈ బ్యాడ్ బ్యాంకులో లీడ్ స్పాన్సర్‌గా 12 శాతం స్టేక్‌తో కెనరా బ్యాంకు వ్యవహరించనున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కలిసి ఎన్‌ఆర్‌సీఎల్‌లో 51 శాతంను కలిగి ఉంటాయి. వీటిని ముంబైలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌తో కలుపుతారు. ఎన్ఆర్సీఎల్ను ఏర్పాటుచేయడంపై చర్చలు తీసుకోవాలని ఇప్పటికే రిజర్వ్ బ్యాంకును ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఇవి కూడా చదవండి..
డబ్బానిండా 5 సెంట్ల కాయిన్లు.. ఎందుకిచ్చాడంటే?
14 ఏండ్ల క్రితం కిడ్నాప్.. ఫేస్బుక్ మెసేజ్‌తో కలిసిన తల్లీకూతురు
2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
చార్ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
సిమ్లా పర్యటనలో రాష్ట్రపతి కోవింద్
ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

