Facebook : 14 ఏండ్ల క్రితం కిడ్నాప్.. ఫేస్బుక్ మెసేజ్‌తో కలిసిన తల్లీకూతురు
Facebook : 14 ఏండ్ల క్రితం ఓ ఆరేండ్ల బాలిక కిడ్నాప్ అయింది. ఇన్నాళ్లు తన తల్లి ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో తెలుసుకోవాలన్న పట్టుదలతో ఆ యువతి పరిశోధన సాగించింది. చివరకు...

ఫ్లోరిడా : (Facebook) 14 ఏండ్ల క్రితం ఓ ఆరేండ్ల బాలిక కిడ్నాప్ అయింది. ఇన్నాళ్లు తన తల్లి ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో తెలుసుకోవాలన్న పట్టుదలతో ఆ యువతి పరిశోధన సాగించింది. చివరకు తల్లి ఒడికి చేరి ఆనందభాష్పాలు రాల్చింది. గత సోమవారం ఈ అద్భుత దృశ్యానికి టెక్సాస్‌లోని లారెడో వేదికగా నిలిచింది. అంతకు రెండు రోజుల ముందు వారు అమెరికా-మెక్సికో సరిహద్దులో కలుసుకుని కండ్లతోనే ఊసులు చెప్పుకున్నారు.
ఫ్లోరిడా క్లెర్మంట్లోని ఇంటి నుంచి ఆరేండ్ల బాలిక జాక్వలైన్ హెర్నాండెజ్ కిడ్నాప్‌నకు గురైంది. అనంతరం ఆమె ఫ్లోరిడాలో పెరిగి పెద్దదైంది. తన తల్లి గురించి తెలుసుకోవాలని, కలుసుకోవాలని ప్రతినిత్యం అనుకునేది. తల్లితో ఎడబాటును కథలుగా ఫేస్బుక్లో రాసేది. జాక్వలైన్ మెసేజ్ చదివిన ఒకరి ద్వారా, ఆమె తల్లి టెక్సాస్‌లో ఉన్నట్లు తెలిసింది. దాంతో ఆమె ఫేస్బుక్ పేజీకి నేరుగా మెసేజ్ పెట్టింది. దాంతో పరుగున వెళ్లిన తల్లి ఏంజెలికా వెన్సెస్ సల్గాడో.. క్లెర్మాంట్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఓ యువతి ఏనాడో కిడ్నాప్ అయిన తన కూతురని చెప్తున్నదని, ఈ విషయాలపై దర్యాప్తు జరిపి సహకరించాలని పోలీసులను ఏంజెలికా కోరింది. దాంతో వివిధ డాక్యుమెంట్లను సిద్ధం చేసిన పోలీసులు.. జాక్వలైన్ హెర్నాండెజ్ చెప్తున్న మాటలు నిజమేనని, వారు కలిసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తొలుత అమెరికా-మెక్సికో సరిహద్దులో కండ్లతోనే మాట్లాడుకున్న తల్లీకూతుర్లను.. నాలుగు రోజుల క్రితం టెక్సాస్‌లో ఒకటి చేశారు.
చిన్ననాట కిడ్నాప్‌కు గురైన తాను.. 14 ఏండ్ల తర్వాత తల్లితో కలువడం చాలా సంతోషంగా ఉన్నదని జాక్వలైన్ హెర్నాండెజ్ చెప్పింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా తల్లిని కలుసుకున్నానని తెలిపింది. దీనికి సంబంధించి పత్రికా ప్రకటనను క్లెర్మాట్ పోలీసులు విడుదల చేశారు. ‘నమ్మశక్యం కానటువంటి భావోద్వేగ కథ. సుఖాంతం అయినందుకు సంతోషంగా ఉన్నది. తప్పిపోయిన వారు కలుసుకోవాలని చేసిన ప్రార్థనలు ఫలించాయి’ అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, 2007 లో ఆరేండ్ల వయసున్న జాక్వలైన్ హెర్నాండెజ్ను ఆమె తండ్రి పాబ్లో హెర్నాండెజ్ క్లెర్మంట్లోని వారి ఇంటి నుంచే కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు బీబీసీ వార్త ప్రసారం చేసింది.
ఇవి కూడా చదవండి..
2024 నాటికి అందుబాటులోకి ఫ్లయింగ్ కార్లు
చార్ధామ్ యాత్రపై నిషేధం ఎత్తివేత
దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
సిమ్లా పర్యటనలో రాష్ట్రపతి కోవింద్
ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

