New App : దగ్గితే చాలు.. వ్యాధేంటో ఈ యాప్ చెప్తుంది!
New App : ఇప్పటికే, బీపీ, హార్ట్‌బీట్, షుగర్ లెక్కలు చెప్పే యాప్‌లు ఉండగా.. ఇప్పుడు దగ్గితే రోగమేంటో చెప్పే యాప్ సిద్ధమవుతున్నది. దగ్గిన శబ్దం వినగానే మనం ఏ ఆరోగ్య సమస్యతో...

వాషింగ్టన్ : ఓ రోగి డాక్టర్ వద్దకు వెళ్లగానే అతను రోజులో ఎన్నిసార్లు దగ్గుతున్నాడో చెప్తాడు. ఊపిరితిత్తుల వైద్యుడు ఆయన సమస్య ఏంటో చెప్పేస్తాడు. డాక్టర్ కంటే వేగంగా ఫలితాలను అందించే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్నది. ఇప్పటికే, బీపీ, హార్ట్‌బీట్, షుగర్ లెక్కలు చెప్పే యాప్‌లు ఉండగా.. ఇప్పుడు దగ్గితే రోగమేంటో చెప్పే యాప్ (New App) సిద్ధమవుతున్నది. దగ్గిన శబ్దం వినగానే మనం ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నామో ఇట్టే చెప్పేస్తుందంట ఈ యాప్.
దగ్గు శబ్దం వినగానే ఏ వ్యాధితో బాధపడుతున్నారో తెలిపే యాప్‌ను కనిపెట్టారు అమెరికన్ శాస్త్రవేత్తలు. దీనిని అమెరికన్ కంపెనీ Hifi Inc అభివృద్ధి చేసింది. ఈ యాప్‌లో వివిధ రకాల వ్యాధులతో వచ్చే మిలియన్ల కొద్దీ దగ్గు వాయిస్‌లను చేర్చారు. తద్వారా ఖచ్చితమైన ఫలితాలు అందేలా చేయగలిగాయి. ఈ శబ్దాలు రోగికి ఎలాంటి సమస్యలు ఉన్నాయనే విషయాన్ని కృత్రిమ మేధస్సు (ఏఐ) సహాయంతో చెప్తాయి. భవిష్యత్‌లో ఉబ్బసం, న్యుమోనియా, కరోనా వంటి వ్యాధి సోకినట్లయితే.. ఆ వ్యక్తి ఎంత తీవ్రంగా ఉంటాడో తెలుస్తుందని చెప్తున్నారు పరిశోధకులు. శ్వాసకోశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషులు దగ్గుతారు. శరీరంలోని నరాలు మెదడుకు సందేశాలను పంపుతాయి. మెదడు కండరాలకు తిరిగి సంకేతాన్ని పంపి, ఊపిరితిత్తుల్లో గాలిని నింపడం ద్వారా ఛాతీ, పొత్తికడుపును ఉబ్బరం చేయమని సూచిస్తుంది. ఇది జరిగినప్పుడు మనలో దగ్గు వచ్చి ఉపశమనం పొందుతాం.
‘దగ్గు శబ్దం కూడా వివిధ వ్యాధుల్లో మారుతుంది. ఉదాహరణకు, ఎవరైనా ఆస్తమాతో బాధపడుతుంటే, అతడి శ్వాస, దగ్గులో ఒక రకమైన ఊపిరి ఉంటుంది. న్యుమోనియా రోగుల ఊపిరితిత్తుల నుంచి భిన్నమైన ధ్వని వస్తుంది. ఈ యాప్‌లో ఉన్న కృత్రిమ మేధస్సు వివిధ దగ్గు శబ్దాల నమూనాలను అర్థం చేసుకుంటుంది. ఈ స్వరాలను వినడం ద్వారా మనుషులు సాధారణంగా అర్థం చేసుకోని వ్యాధుల గురించి యాప్ తెలియజేస్తుంది’ అని చీఫ్ మెడికల్ ఆఫీసర్, టీబీ నిపుణుడు డాక్టర్ పీటర్ స్మాల్ వెల్లడించారు. ప్రస్తుతం మరింత అభివృద్ధి చేసే పనుల్లో ఉన్నామని, త్వరలోనే ప్రజలకు ఈ యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు స్పెయిన్‌లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
సిమ్లా పర్యటనలో రాష్ట్రపతి కోవింద్
ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడికి అవకాశం.. ఇంటెలిజెన్స్ నివేదిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

