హైదరాబాద్, ఆగస్టు 20: అమెరికాకు చెందిన ఫ్లట్టర్ ఎంటర్టైన్మెంట్..హైదరాబాద్లో నూతన జీసీసీ ప్రారంభించింది. రూ.30 కోట్ల పెట్టుబడితో 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ కోసం ప్రస్తుతం 700 మంది సిబ్బందిని నియమించుకున్నట్లు, ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 900కి పెంచుకోనున్నట్లు కంపెనీ సీవోవో ఫిల్ బిషప్ తెలిపారు. అలాగే వచ్చే రెండేండ్లలో మొత్తం సిబ్బందిలో 40 శాతం మంది మహిళ ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
ముంబై, ఆగస్టు 20: ప్రముఖ బీమా సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మరో మైలురాయికి చేరుకున్నది. జూలైతో ముగిసేనాటికి కంపెనీ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్(ఏయూఎం) విలువ రూ.3 లక్షల కోట్లు దాటి రూ.3.14 లక్షల కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. క్లెయిం సెటిల్మెంట్ రేషియో 99.17 శాతంగా ఉన్నదని, కేవలం 1.27 రోజులోనే తమ పాలసీ సెటిల్మెంట్ చేస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ బాగ్చి తెలిపారు.