Flipkart Big Diwali Sale | ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్ (Flipkart) దీపావళి పండుగ సందర్భంగా మరో ఆఫర్ సేల్ తీసుకొచ్చింది. విజయదశమి సందర్భంగా ‘బిగ్ బిలియన్ డేస్’ అనే పేరుతో ఆఫర్లు అందించింది. తాజాగా దీపావళి నేపథ్యంలో బిగ్ దీపావళి సేల్’ తేదీలు ప్రకటించింది. ఈ నెల 21వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ దీపావళి సేల్ ప్రారంభం అవుతుందని పేర్కొంది. ఇక ఫ్లిప్ కార్ట్ ప్లస్, వీఐపీ ఖాతాదారులకు ఒక రోజు ముందే అంటే ఈ నెల 20 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లపై భారీగా ఆఫర్లు ఉంటాయని తెలిపింది.
సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది. ఐ-ఫోన్ 15 ఫోన్ రూ.49,999లకే సొంతం చేసుకోవచ్చు. పాత మోడల్ ఆపిల్ ఎయిర్ పాడ్స్ రూ.9,999 కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అలాగే ఆపిల్ తన మ్యాక్స్ బుక్ ఎయిర్ ఎం2 మీద రాయితీ ఇస్తామని ప్రకటించినా.. ఎంతన్న సంగతి బయట పెట్టలేదు. ఇక దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఫోన్ రూ.37,999, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 23 ఎఫ్ఈ రూ.29,249లకు లభిస్తాయి.
ఇక మోటరోలా మోటో ఎడ్జ్ 50 ప్రో ఫోన్ రూ.35,999 నుంచి రూ.29,999లకు పడిపోతుంది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ రూ.21,999, మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ రూ.23,999 లకే సొంతం చేసుకోవచ్చు. ఇంకా పోకో ఎఫ్6, పోకో ఎక్స్6 ప్రో, వన్ ప్లస్ 12, శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఐ-ఫోన్ 15, ఐ-ఫోన్ 15 ప్రో, ఐ-ఫోన్ 14 తదితర ఫోన్లపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.