హైదరాబాద్-లక్నో
హైదరాబాద్ నుంచి దేశంలోని ఆయా కొత్త నగరాలకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది.
- ఎయిర్ ఇండియా విమాన సర్వీసు
- అమృత్సర్, గ్వాలియర్, కొచ్చీకి కూడా ఫ్లైట్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి దేశంలోని ఆయా కొత్త నగరాలకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లక్నో, అమృత్సర్, కొచ్చీలకు శుక్రవారం ఫ్లైట్లు మొదలయ్యాయి. అలాగే గ్వాలియర్‌కు ఈ నెల 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఈ కొత్త రూట్లకు విమాన సేవల్ని తీసుకురాగలిగింది. కాగా, హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రోజూ ఉదయం 7:30 గంటలకు బయలుదేరి 10:15 గంటలకు చేరుకుంటుంది. లక్నోకు మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలై సాయంత్రం 4:35 గంటలకు చేరుతుంది. అయితే హైదరాబాద్-లక్నో మధ్య వారానికి ఆరు సర్వీసులే ఉంటాయి.
ఇక కొచ్చీకి రోజూ రాత్రి 7:45 గంటలకు బయలుదేరి 9:30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. హైదరాబాద్-గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్వీసులుండనున్నాయి. ఇవి మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలై సాయంత్రం 4:20 గంటలకు చేరుతాయి. జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణికర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రవేశపెట్టడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రయాణీకుల కోసం టెర్మినల్ విస్తరణ, అదనపు సౌకర్యాలను చేపట్టామన్నారు. కాగా, ఈ కొత్త సర్వీసులతో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని 19 ప్రాంతాలకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నడుస్తున్నట్టు అవుతున్నదని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

