హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి ఓపెన్‌కాస్ట్(ఓసీ) గనులకు కేంద్ర ప్రభుత్వం ఫైవ్‌స్టార్ రేటింగ్ ఇస్తూ అవార్డులను ప్రకటించింది. దేశంలోని ప్రమాద రహిత గనులను కేంద్రం ఏటా పురస్కారాలకు ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది రామగుండం-3లోని ఆర్జీవోసీ-1(ఎక్స్టెన్షన్ ఫేస్-2), ఇల్లందులోని జవహార్ ఖని ఓపెన్‌కాస్ట్‌లు ఎంపికయ్యాయి. సోమవారం రాత్రి న్యూఢిల్లీలోని స్కోప్ కన్వెన్షన్ సెంటర్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రి సతీశ్ చంద్రదూబే చేతుల మీదుగా సింగరేణి సీఎండీ బలరాం ఈ అవార్డులను స్వీకరించారు.