Market Capitalisation | గతవారం ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఐదు రూ.67,843 మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. వాటిల్లో హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీగా లాభ పడ్డాయి. హెచ్యూఎల్, రిలయన్స్తోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ లబ్ధి పొందగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎస్బీఐ నష్టపోయాయి.
హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25,234.61 కోట్లు పెరిగి రూ.5,25,627.06 కోట్లకు పెరిగింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.21,892.61 కోట్లు ఎక్కువై రూ.18,87,964.18 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,251.27 కోట్లు వృద్ధి చెంది రూ.7,68,052.87 కోట్ల వద్ద ముగిసింది. మార్టగేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ ఎం-క్యాప్ రూ.3,943.09 కోట్లు పెరిగి రూ.4,03,969.09 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.521.75 కోట్ల వృద్ధితో రూ.4,06,245.26 కోట్ల వద్ద స్థిర పడింది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 22,594.64 కోట్లు కోల్పోయి రూ.12,98,999.83 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.7,474.58 కోట్లు పతనమై రూ.6,59,587.97 కోట్ల వద్ద స్థిర పడింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.3,480.6 కోట్లు నష్టపోయి రూ.4,43,106.96 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ మార్కెట్ క్యాపిలైజేషన్ రూ.2,600.14 కోట్లు కోల్పోయి రూ.5,16,762.48 కోట్ల వద్ద నిలిచింది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎం-క్యాప్ రూ.172.04 కోట్ల నష్టంతో రూ.4,51,577.84 కోట్లకు పరిమితమైంది.