న్యూఢిల్లీ, ఆగస్టు 31: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు అదుపులోనే ఉంటున్నది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించిన ద్రవ్యలోటులో జూలై చివరినాటికి 21.3 శాతం (రూ.3.21 లక్షల కోట్లు)గా నమోదయ్యింది. గతేడాది ఇదేకాలంలో బడ్జెట్ అంచనాల్లో నిర్దేశించిన మొత్తంలో 103 శాతానికి చేరిపోయింది. కొవిడ్-19 సంబంధిత వ్యయాల కారణంగా అప్పట్లో అది ఆ స్థాయికి చేరింది. ప్రభుత్వ ఆదాయం- వ్యయాల మధ్య వ్యత్యాసమైన ఈ ద్రవ్యలోటు 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో… జీడీపీలో ద్రవ్యలోటు 9.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై వరకూ కేంద్ర ప్రభుత్వ ఆదాయ వసూళ్లు బడ్జెట్ అంచనాల్లో 34.6 శాతం (రూ.6.83 లక్షల కోట్లు), ప్రభుత్వ వ్యయం రూ.10.04 లక్షల కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 28.8 శాతం).