Fiscal Deficit | 6.7 శాతానికి ద్రవ్యలోటు
Fiscal Deficit | ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వపు ద్రవ్యలోటు రూ.15.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
Fiscal Deficit | న్యూఢిల్లీ, మే 31: ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వపు ద్రవ్యలోటు రూ.15.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఇది జీడీపీలో 6.7 శాతం. ఇది 6.8 శాతం ఉంటుందని నిరుడు బడ్జెట్లో కేంద్రం అంచనా వేయగా, అటుతర్వాత ఆ అంచనాల్ని 6.9 శాతానికి సవరించారు. సవరించిన లక్ష్యానికంటే తక్కువగానే ద్రవ్యలోటు నమోదైనట్టు మంగళవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వపు మొత్తం ఆదాయం, మొత్తం ఖర్చు మధ్య వ్యత్యాసమే ద్రవ్యలోటు. ఈ లోటు మేరకు ప్రభుత్వం మార్కెట్లో రుణాలు సమీకరిస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 6.4 శాతానికి (రూ.16.61 లక్షల కోట్లు) అదుపు చేయాలని బడ్జెట్లో ప్రభుత్వం నిర్దేశించుకుంది. వివరాలివి..
- ముగిసిన ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా కేంద్రానికి రూ.18.2 లక్షల కోట్లు సమకూరింది. సవరించిన అంచనా రూ.17.65 లక్షలకోట్ల కంటే ఇది అధికం.
- కేంద్ర ప్రభుత్వపు మొత్తం వ్యయం రూ.37.94 లక్షల కోట్లు. ఇది కూడా సవరించిన అంచనా రూ.37.7 లక్షల కోట్లకంటే ఎక్కువ.
- దీంతో ద్రవ్యలోటు రూ.15.87 లక్షల కోట్లుగా నమోదయ్యింది.
- 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో 4.5 శాతంగా ఉందని సీజీఏ తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

