ఫిన్టెక్ విప్లవం రావాలి

- దేశంలో ప్రతీ ఒక్కరి ఆర్థిక సాధికారతే లక్ష్యం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రతీ భారతీయుడి ఆర్థిక సాధికారత కోసం దేశంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఫిన్టెక్ పరిశ్రమ నేడు అందరికీ చేరువైందన్న మోదీ.. ఈ ఫిన్టెక్ సేవలు మరింత విస్తరించి ఫినెటెక్ విప్లవంగా మారాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నిర్వహించిన ఇన్ఫినిటి ఫోరం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన సాంకేతిక మార్పులు ఆహ్వానించదగినవన్న మోదీ.. గతేడాది ఏటీఎం నగదు ఉపసంహరణలను మొబైల్ చెల్లింపులు మించిపోయాయని గుర్తుచేశారు. బ్యాంకింగ్ రంగంలో భౌతిక సేవల కంటే డిజిటల్ సేవల వినియోగం ఎక్కువైందని పేర్కొన్న మోదీ.. డిజిటల్ ఇండియా సాకారంలో ఫిన్టెక్ విప్లవం కీలకమన్నారు. నేడు ఎటువంటి లావాదేవీనైనా ఇంట్లో కూర్చునే ఇంటర్నెట్ సాయంతో మొబైల్ నుంచి పూర్తి చేయగలుగుతుండటం సంతోషకరమన్నారు.
అంతా ఏకం కావాలి
రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులను సమర్థవంతంగా నియంత్రించడానికి అన్ని దేశాలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇన్ఫినిటి ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. డాటాను ఓ ఆదాయ వనరుగా చూస్తున్నప్పుడు, దాని నియంత్రణ సమష్ఠి కృషితోనే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీల రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొస్తున్న వేళ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
క్రిప్టో బిల్లుకు ముకేశ్ జై
భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ.. క్రిప్టోకరెన్సీ బిల్లుకు జై కొట్టారు. ప్రతిపాదిత డాటా ప్రైవసీ బిల్లుకూ మద్దతిచ్చారు. ప్రైవసీ ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. దేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, రక్షణ బాధ్యత కేంద్రానికి ఉంటుందన్న అంబానీ.. డిజిటల్ సమాచారం నిల్వ, పంచుకోవడంపై కఠిన నిబంధనల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇన్ఫినిటి ఫోరం కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోకరెన్సీ బిల్లు ఆవశ్యకత ఉందన్నారు. బ్లాక్చైన్ టెక్నాలజీని తాను విశ్వసిస్తానని చెప్పిన ముకేశ్.. క్రిప్టోకరెన్సీకి ఇది భిన్నమని స్పష్టం చేశారు. సమసమాజ నిర్మాణానికి బ్లాక్చైన్ టెక్నాలజీ ముఖ్యమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

