న్యూఢిల్లీ, డిసెంబర్ 12: జీఎస్టీ రేట్లను హేతుబద్ది కరించడంతో పాటు కొత్తగా పలు ఉత్పత్తులపై 35 శాతం జీఎస్టీ విధించే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని దేశీయ రిటైలర్ అసోసియేషన్.. కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్‌కు సూచించింది. సిగరేట్లు, పొగాకుతోపాటు వాయు పానీయాలపై 35 శాతం జీఎస్టీని విధించాలని జీవోఎం ప్రతిపాధించింది.
జీఎస్టీని మరింత సరళీకరించడంతోపాటు పన్నులను తగ్గించాలని ఇండియన్ సేల్లర్స్ అసోసియేషన్ రాసిన లేఖలో పేర్కొంది. దీనిపై వచ్చేవారం చివర్లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.