Interest Rates | ముంబై, అక్టోబర్ 18: అధిక వడ్డీరేట్లతో ఇక్కట్లేనని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. 9 శాతం కంటే అధికంగా వడ్డీరేట్లు ఉంటే ఇండ్ల కొనుగోలుపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇండస్ట్రీ బాడీ ఫిక్కీ, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ సంయుక్తంగా ‘హోమ్బయర్ సెంటిమెంట్ సర్వే’ పేరుతో నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సర్వేలో 7,615 మంది తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
ఫిక్కీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రమోద్ రావు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరమైన వృద్ధికి రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరగనుండటంతో దీర్ఘకాలికంగా ఇది మేలు చేయనున్నదన్నారు. ఫిక్కీ మాజీ అధ్యక్షుడు సందీప్ సౌమెనీ మాట్లాడుతూ..దేశీయ రియల్ ఎస్టేట్ రంగం విప్లవాత్మక మార్పులు వచ్చాయని, సిద్ధంగా ఉన్న ఇండ్లను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల ఆధారంగా ఒక నివేదికను రూపొం