న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: క్రోమా..ప్రస్తుత పండుగ ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దసరా, దీపావళి, ధంతేరస్లను దృష్టిలో పెట్టుకొని ప్రకటించిన ఈ ఆఫర్లు అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉండనున్నాయని వెల్లడించింది.
తొమ్మిది విభాగాల్లో టీవీలు, స్మార్ట్ఫోన్లు, ఏసీలు కొనుగోలు చేసిన వారికి 20 శాతం వరకు క్యాష్బ్యాక్తోపాటు 45 శాతం వరకు తగ్గింపు ధరకు విక్రయిస్తున్నది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, వాషింగ్మిషిన్లు, ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్లను ఆన్లైన్, ఆఫ్లైన్లో కొనుగోలు చేసిన వారికి క్యాష్బ్యాక్తోపాటు ఈఎంఐ, ఎక్సేంజ్ ప్రయోజనాలు కూడా అందిస్తున్నట్టు ప్రకటించింది.