బెంగళూరు, అక్టోబర్ 25: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్..వినియోగదారుల కోసం ‘ఆహా దీపావళి’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.60 వేల విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి వెండి నాణెం, వజ్రాలను కొనుగోలు చేసిన వారికి బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
అలాగే విజియోగదారుల వజ్రాలపై 20 శాతం తగ్గింపు, ప్లాటినం ఆభరణాలపై 7 శాతం రాయితీని ఇస్తున్నట్లు కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కా తెలిపారు కస్టమర్లు తమ పాత బంగారాన్ని హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ బంగారు ఆభరణాలతో ఎక్సేంజ్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, ధనత్రయోదశి కోసం ఈరోజు నుంచే అడ్వాన్స్ బుకింగ్‌లను కూడా కంపెనీ ప్రారంభించింది.