హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): సువాసనకు.. చక్కని ఆరోగ్యానికి.. గృహోపకరణ వస్తువులకు.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే ‘అగార్ వుడ్’ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. సాగుకు అనుకూలమైన వాతావరణం, అధిక ఆదాయం ఇచ్చేది కావడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలు ఈ పంట సాగును మొదలుపెడుతున్నారు. అటవీ, తోట పంటల సాగులో ‘అగార్ వుడ్’ రైతులకు సిరులు పండిస్తున్నది. ఇప్పటి వరకు తైవాన్, లావోస్, థాయ్‌లాండ్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి దేశాల్లోనే ఈ చెట్లను సాగు చేస్తుండగా..తాజాగా తెలుగు రాష్ర్టాల్లోని రైతులు సైతం ఈ చెట్లను పెంచడానికి ముందుకొస్తున్నారు.
నాలుగేండ్లకే ఆదాయం..
సువాసనలు వెదజల్లే కలప వృక్షాలైన ఎర్రచందనం, శ్రీగంధం మాదిరే అగార్వుడ్. అయితే, ఆ చెట్లు ఆదాయం తెచ్చిపెట్టాలంటే దాదాపు 25 నుంచి 30ఏండ్లపాటు ఎదురుచూడాలి. అదే అగార్వుడ్ని సాగుచేస్తే నాలుగేండ్లకే ఆదాయం కళ్లజూడొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకసారి సాగుచేస్తే 40ఏండ్లపాటు పలు రకాలుగా ఈ చెట్టు ఆదాయం తెచ్చిపెడుతుంది. మిగితా చెట్లతో పోలిస్తే అగార్వుడ్ చెట్లకు చీడపీడల ప్రభావం ఉండదు. ఈ చెట్లు ఫంగస్‌ను ఆహారంగా మలుచుకొని బలంగా పెరుగుతుంది. నాటిన నాలుగేండ్లకు చెట్టు కాస్త లావు అయ్యాక కాండానికి రంధ్రాలు పెట్టి ఫంగస్‌ను ఎకిస్తారు. దీంతో కాండం లోపల రెజిన్ లాంటి పదార్థం విడుదలై కొన్ని రకాల రసాయనాలను విడుదల చేయడంతో అగార్వుడ్ సుగంధ భరితమవుతుంది. అనంతరం ఆ బెరడు తొలగించి సేకరించి చెకముకలను కిలోల చొప్పున విక్రయిస్తారు. ఒక చెట్టుకు ఆరునెలల్లో సుమారు మూడు కిలోల వరకు చెక ముకలు వస్తే కిలో ధర రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకూ ఉంటుంది.
నూనెకు డిమాండ్..
అగార్వుడ్ చెక ముకల్ని ప్రాసెస్ చేసి సేకరించే నూనెకు అరబ్ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. నాణ్యతను బట్టి లీటరు నూనె ధర రూ.30-70లక్షల వరకు ధర పలుకుతుంది.
అగార్వుడ్ను ఉపయోగించే ఉత్పత్తులు