హైదరాబాద్, సెప్టెంబర్ 24 : ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ చెన్నై షాపింగ్ మాల్.. దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని ట్రిపుల్ ధమాకా ఆఫర్లను ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపుతో కొనుగోలుదారులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో రూ.1,051 నుంచి రూ.2,625 లోపు ధర కలిగిన రెడీమేడ్ వస్ర్తాల కొనుగోలుపై 6.25 శాతం తగ్గింపును ఇస్తున్నది.
దీంతోపాటు ట్రిపుల్ ధమాకాలో భాగంగా స్పాట్గిఫ్ట్స్, కాంబో ఆఫర్లు, డిస్కౌంట్ కూడా అందిస్తున్నది. ఈ పండుగ వేళ మహిళలు, పురుషులతోపాటు అన్ని వయస్సు కలిగిన వారికి లక్షల డిజైన్ల వస్ర్తాలను తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.