హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఈవీ బస్సుల తయారీ సంస్థ ఒలెక్రా గ్రీన్‌టెక్‌కు మరో రూ.185 కోట్ల విలువైన 123 ఎలక్ట్రిక్ బస్సుల తయారీ ఆర్డర్ లభించింది. ఈ ఆర్డర్ ఠాణె మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ నుంచి లభించినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఈ బస్సులను వచ్చే తొమ్మిది నెలలో డెలివరీ చేయాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సంస్థ ఇప్పటికే పుణెతోపాటు ముంబై, నాగపూర్లలో ఈ-బస్సులను ఆపరేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.