హైదరాబాద్, మార్చి 6(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సెమీకండక్టర్ల యూనిట్‌ను నెలకొల్పాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఎన్ఎక్స్పీ సెమీకండక్టర్స్ కంపెనీ ప్రతినిధులను కోరారు. గురువారం కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి.. రాష్ట్రంలో సెమీకండక్టర్ల యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి ఉన్న అనుకూలతలను వివరించారు. 2030 నాటికి భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ మార్కెట్ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.
ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం…
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో లెన్స్‌కార్ట్ తయారీ యూనిట్ శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా చొరవ తీసుకుంటున్నామన్నారు.