EPFO | న్యూఢిల్లీ, మే 13: గడిచిన ఆర్థిక సంవత్సరంలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో 4.45 కోట్ల క్లెయింలను సెటిల్ చేసింది. అలాగే 2.84 కోట్ల అడ్వాన్స్ క్లెయిం సెటిల్మెంట్లు కూడా ఉన్నాయని గత ఆర్థిక సంవత్సరానికిగాను విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్యారా 68కే ప్రకారం విద్యా, వివాహాం, 68 బీ ప్రకారం గృహ కొనుగోలుకు సంబంధించి ఆటో క్లెయిం చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఇటీవల లిమిట్‌ను రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో లక్షలాది మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు ప్రయోజనం కలుగనున్నది.