EPFO | ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈ ఏడాది జులైలో 21.04లక్షల మంది సభ్యులు చేరారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన డేటాలో సంస్థ పేర్కొంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది జులై దాదాపు 9.79 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్స్‌ను చేర్చుకుందని కార్మిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా పెరుగుతున్న ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై అవగాహన పెరగడం, ఈపీఎఫ్‌వో విజయవంతమైన అవుట్‌రీచ్ కార్యక్రమాల కారణంగా నమోదయ్యారని చెప్పింది. గత ఏడాదితో పోలిస్తే 5.55శాతం నమోదు పెరిగిందని తెలిపింది. ఈపీఎఫ్‌వో 18-25 సంవత్సరాల వయసు గల వారిలో 5.98లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లలో గణనీయంగా 61.06శాతంగా ఉందని తెలిపింది. అంతకుముందు నిష్క్రమించిన దాదాపు 16.43 లక్షల మంది సభ్యులు జూలై 2025లో మళ్లీ ఈపీఎఫ్‌వోలో తిరిగి చేరారు. ఈ సంఖ్య జూలై 2024తో పోలిస్తే సంవత్సరానికి 12.12 శాతం గణనీయమైన వృద్ధిని డేటా చూపించింది.
జూలై 2025లో ఈపీఎఫ్వలో దాదాపు 2.80 లక్షల మంది కొత్త మహిళా సబ్స్క్రైబర్లు చేరారు. పేరోల్స్ డేటా రాష్ట్రాల వారీగా విశ్లేషణలో మొదటి ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నికర పేరోల్స్ జోడింపు దాదాపు 60.85 శాతం వాటాను కలిగి ఉన్నాయని, ఫలితంగా ఈ నెలలో మొత్తం 12.80 లక్షల మంది అదనంగా పెరిగినట్లు డేటా పేర్కొంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఈ నెలలో మొత్తం నిరకంగా 5 శాతానికిపైగా పేరోల్స్ వ్యక్తిగతంగా జోడించాయి. పరిశ్రమల వారీగా డేటాను నెలవారీగా పోల్చడంతో ఇనుప ఖనిజం తవ్వకం, విశ్వవిద్యాలయాలు, బీడీ తయారీ, వస్త్ర తయారీ, ఆసుపత్రులు, వాణిజ్య వ్యాపారం, ట్రావెల్ ఏజెన్సీలు తదితర పరిశ్రమల్లో పేరోల్స్ గణనీయమైన పెరుగుదల కనిపిస్తుందని పేర్కొంది. ఏప్రిల్ 2018 నుంచి ఈపీఎఫ్‌వో సెప్టెంబర్ 2017 కాలానికి సంబంధించిన పేరోల్స్ డేటాను విడుదల చేస్తూ వస్తోంది. నెలవారీ పేరోల్స్ డేటాలో ఆధార్ ధ్రువీకరించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా తొలిసారిగా ఈపీఎఫ్‌వోలో చేరిన సభ్యుల సంఖ్య, ఈపీఎఫ్‌వో కవరేజ్ నుంచి నిష్క్రమించిన ప్రస్తుత సభ్యులు, నిష్క్రమించి సభ్యులుగా తిరిగి చేరిన వారి సంఖ్యను నికర నెలవారీ పేరోల్స్ లెక్కల్లోకి తీసుకుంటారు.