Energizer Hard Case P28K | రోజురోజుకు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. సరికొత్త టూల్స్‌తో స్మార్ట్ ఫోన్ ప్రేమికులకు నూతన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు. ఆ బాటలోనే ‘ఎనర్జీజైర్ (Energizer)’ బ్రాండ్ సంస్థ అవెనీర్ టెలికం ‘హార్డ్ కేస్ పీ28కే (Hard Case P28K) స్మార్ట్ ఫోన్‌ను సోమవారం బార్సిలోనా వేదికగా జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ 28 వేల ఏఎంహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. రెగ్యులర్ ఫోన్ వాడకం దారులకు సింగిల్ చార్జింగ్‌తో వారం వరకూ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 122 గంటల టాక్ టైం, 94 రోజుల (2252 గంటల) వరకు స్టాండ్ బై బ్యాటరీ లైఫ్ ఉంటుంది.
పారిస్ కేంద్రంగా పని చేస్తున్న ఎనర్జీజైర్ హార్డ్ కేస్ పీ28 కే స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + స్క్రీన్ కలిగి ఉంటుంది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. 60-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 20-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రికార్డింగ్ వీడియోలు 4కే క్వాలిటీ కలిగి ఉన్నాయి. 4జీ ఎల్టీఈ కనెక్టివిటీ గల ఈ ఫోన్ త్రీ ఇయర్స్ వారంటీ అందిస్తుంది.
ఎనర్జీజైర్ హార్డ్ కేస్ పీ28కే స్మార్ట్ ఫోన్ సేల్స్ వచ్చే అక్టోబర్ లో ప్రారంభం అవుతాయి. ఈ ఫోన్ ధర దాదాపు రూ.22 వేల (250 యూరోలు) తో ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. 2018లో 16వేల ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో కూడిన ఎనర్జీజైర్ పవర్ మ్యాక్స్ పీ16కే ప్రో ఫోన్, 2019లో ఎనర్జీజైర్ పీ18కే పాప్ ఫోన్లను ఆవిష్కరించింది.