న్యూఢిల్లీ, జూన్ 26: ఉద్యోగులు/పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) మరోసారి గడువు పెంచింది. ఇప్పటికే మే 3 నుంచి పెంచిన గడువు జూన్ 26తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తు చేయడంలో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ ఉద్యోగులు చేస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా మరో 15 రోజుల చివరి అవకాశం ఇస్తున్నట్టు ఈపీఎఫ్‌వో సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ నిబంధనలపై స్పష్టత లేకపోవడం, ఈపీఎఫ్‌వో వివరణలు జాప్యంకావడం వంటి కారణాలతో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ నుంచి వచ్చే అధిక పెన్షన్ కోసం మెజారిటీ ఉద్యోగులు ఇంకా దరఖాస్తులు సమర్పించలేదు.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం ఆప్షన్/ఉమ్మడి ఆప్షన్ వ్యాలిడేట్ చేయడానికి దరఖాస్తులు సమర్పించే చివరితేదీని 2023 జూలై 11 వరకూ పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే గడువును ఉద్యోగి (సభ్యుడు)కి 15 రోజులు, యాజమాన్యానికి మూడు నెలల గడువు పెంచుతున్నట్టు ఈపీఎఫ్‌వో సెంట్రల్ ట్రస్టీల బోర్డు సభ్యుడు రఘునాథన్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. కేవైసీ అప్డేట్ చేయడం, ఆప్షన్/ఉమ్మడి ఆప్షన్‌కు అన్లైన్లో దరఖాస్తు సమర్పించడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే ఫిర్యాదును EPFiGMS లో నమోదు చేయాలని ఈపీఎఫ్‌వో కోరింది. ‘హయ్యర్ పెన్షనరీ బెనిఫిట్స్ ఆన్ హయ్యర్ వేజెస్’ కింద గ్రీవియెన్స క్యాటగిరీని సెలక్ట్ చేసి ఫిర్యాదును నమోదు చేయాలని తెలిపింది.
అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ఉద్యోగులు/పెన్షనర్లకు తలెత్త పలు సందేహాలను నివృత్తి చేసేందుకు సమాధానాల రూపంలో ఎఫ్ఏక్యూ జాబితాను ఈపీఎఫ్‌వో విడుదల చేసింది. దరఖాస్తు ఫారంలతో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు, పెన్షన్ గణన ఫార్ముల్లా తదితరాలను ఈ ఎఫ్ఏక్యూలో పొందుపర్చింది. అవి..
? ఈపీఎఫ్ స్కీమ్ పేరా 26(6) కింద యాజమాన్యం వెరీఫై చేసిన ఉమ్మడి ఆప్షన్ రుజువు అవసరమని గత సర్క్యులర్లలో నిర్దేశించారు. పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్‌కు రుజువుగా ఏ డాక్యుమెంట్‌ను పరిగణిస్తారు?
3 పేరా 26 (6) కింద అనుమతి సిద్ధంగా లేకపోతే ఫీల్డ్ ఆఫీసర్లు ఈ అంశాల్ని చూస్తారు. ఎ) నిర్దిష్ఠ వేతన పరిమితి 5000/ 6500/15000కు మించిన వాస్తవ వేతనంపై పీఎఫ్ ఖాతాకు యాజమాన్యం వాటా ఇప్పటివరకూ/రిటైర్మెంట్ వరకూ చెల్లింపు జరిగిందా లేదా. బి) యాజమాన్యం చెల్లించాల్సిన అడ్మినిస్ట్రేటివ్ చార్జీల చెల్లింపు జరుగుతున్నదా.సి) అటువంటి చెల్లింపుల ఆధారంగా ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో వడ్డీ అప్టేడ్ అవుతున్నదా. డి) రిటైర్మెంట్/సూపర్‌యాన్యుయేషన్ వరకూ వాస్తవ జీతంపై పీఎఫ్‌కు కంట్రిబ్యూట్ చేసినవారు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకపోతే, ఫైనల్ క్లెయిం సెటిల్మెంట్ సమయంలో/అధిక వేతనంపై పెన్షన్ మంజూరి జరిగే ముందు.. వారి ఉమ్మడి వినతిని, యాజమాన్యం అండర్‌టేకింగ్‌ను వారి చివరి యాజమాన్యం ద్వారా సమర్పించవచ్చు.
? అధిక పెన్షన్ ఆప్షన్/ ఉమ్మడి ఆప్షన్ వ్యాలిడేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసినపుడు డాక్యుమెంట్ రుజువు ఇవ్వకపోతే, ఆ అప్లికేషన్‌ను తిరస్కరిస్తారా
3 తిరస్కరించరు. అర్హమైన దరఖాస్తుల్ని కేవలం ఆ కారణంతో (రుజువు ఇవ్వకపోవడం) తిరస్కరించడం జరగదు. ఒకటవ ప్రశ్నకు సమాధానంలో తెలిపిన డాక్యుమెంట్లను రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (ఆర్పీఎఫ్సీ) కార్యాలయం సంబంధిత యాజమాన్యం నుంచి తీసుకుంటుంది. అది ఆర్పీఎఫ్సీ విధి.
? పీఎఫ్ మినహాయింపు పొందిన సంస్థ కు చెందిన సభ్యులు ఉమ్మడి వినతి/యాజమాన్యం అండర్‌టేకింగ్ సమర్పించని కేసులను ఈపీఎఫ్‌వో ట్రస్ట్ ఏ విధంగా చూస్తుంది?
3 1,2 ప్రశ్నలకు తెలిపిన సమాధానాల తరహాలోనే వీటిని డీల్ చేస్తారు
? పెన్షన్‌ను గణించే అనుసరించే ఫార్ముల్లా ఏమిటి?
3 ఈపీఎస్ 95 పేరా 12లో పేర్కొన్నదాని ప్రకారం పెన్షన్ గణింపు జరుగుతుంది. పెన్షన్‌బుల్ సర్వీసు, పెన్షన్‌బుల్ సేలరీ, పెన్షన్ క్యాలిక్యులేషన్‌కు పెన్షన్ మొదలయ్యే తేదీనిబట్టి ఫార్ముల్లా ఉంటుంది.
? 2014 సెప్టెంబర్ 1కి ముందు రిటైరై, అధిక వేతనంపై ఎక్కువ పెన్షన్ అర్హత ఉన్న ఈపీఎస్ 95 సభ్యుల పెన్షన్‌బుల్ వేతనాన్ని ఎలా లెక్కిస్తారు?
3 పెన్షన్ మొదలైన తేదీ 2014 సెప్టెంబర్ 1కి ముందే అయినందున, ఆ సభ్యుడు పెన్షన్ ఫండ్ సభ్యత్వం నుంచి వైదొలిగిన తేదీకి ముందు 12 నెలల సర్వీసులో తీసుకున్న నెలవారీ సగటు వేతనం అధారంగా పెన్షన్‌బుల్ సేలరీని క్యాలిక్యులేట్ చేస్తారు.
? 2014 సెప్టెంబర్ 1కి ముందు పదవీ విరమణ చేసినప్పటికీ, ఆ తేదీ తర్వాత పెన్షన్ మొదలైనవారికి పెన్షన్‌బుల్ వేతనాన్ని ఎలా లెక్కిస్తారు?
3 2014 సెప్టెంబర్ 1నాడు లేదా అటుతర్వాత పెన్షన్ ప్రారంభమైనందున, ఆ సభ్యులు పెన్షన్ ఫండ్ సభ్యత్వం నుంచి వైదొలిగిన తేదీకి ముందు 60 నెలల సర్వీసులో తీసుకున్న నెలవారీ సగటు వేతనం అధారంగా పెన్షన్‌బుల్ సేలరీని గణిస్తారు.
? భవిష్యత్తులో (ఉదాహరణకు 2030లో) రిటైర్ కాబోయే సభ్యుడి పెన్షన్ లెక్కింపు ఎలా ఉంటుంది?
3 ఆ వ్యక్తి పెన్షన్ మొదలయ్యే తేదీ సమయంలో అమల్లో ఉండే 1995 ఈపీఎస్ నిబంధనల ఆధారంగా క్యాలిక్యులేట్ చేస్తారు.
అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు చెల్లించాల్సిన అదనపు మొత్తం ఎంతో తెలుసుకునేందుకు ఈపీఎఫ్‌వో ఒక క్యాలిక్యులేటర్‌ను విడుదల చేసింది. ఎక్సెల్ సాఫ్ట్వేర్ ఆధారిత ఈ క్యాలిక్యులేటర్‌ను ఈపీఎఫ్‌వో మెంబర్ సేవా పోర్టల్‌లో పెన్షన్ అప్లికేషన్ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో వివరాలు నింపితే అధిక పెన్షన్‌కు ఏర్పడిన తరుగుదలను భర్తీ చేయడానికి ఎంత చెల్లించవచ్చో క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే పీఎఫ్ ఖాతా (ఈపీఎఫ్) నుంచి పెన్షన్ ఖాతాకు (ఈపీఎస్)కు వడ్డీతో సహా బదిలీ కావాల్సిన మొత్తం ఎంతో కూడా వెల్లడిస్తుంది.
? 2014 సెప్టెంబర్ 1 తర్వాత రిటైర్ అయి న ఈపీఎస్ సభ్యుల పెన్షన్‌బుల్ వేతనాన్ని ఎలా కాలిక్యులేట్ చేస్తారు?
3 ఆ సభ్యుడి పెన్షన్ మొదలయ్యే తేదీ ఆధారంగా పెన్షన్‌బుల్ సేలరీ లెక్కింపు ఉంటుంది. ఉదాహరణకు ‘ఏ’ అనే ఒక వ్యక్తి 2015 జనవరి 1న 60 ఏండ్ల వయస్సులో పదవీ విరమణ చేసినా, 58 ఏండ్ల వయస్సుకే సూపర్ యాన్యుయేట్ అయినట్టుగా పరిగణిస్తారు. అంటే 2014 సెప్టెంబర్ 1కి ముందే రిటైర్ అయినట్టు. దాని ప్రకారం అంతక్రితం 12 నెలల సగటు వేతనం ఆధారంగా పెన్షన్‌బుల్ సేలరీని లెక్కిస్తారు. ‘బీ’ అనే వ్యక్తి 2012 జనవరి 1న 50 ఏండ్ల వయస్సులో రిటైర్ అయితే, 2014 సెప్టెంబర్ 1 తర్వాత 58 ఏండ్ల వయస్సు నుంచి పెన్షన్‌ను కోరుకోవచ్చు. ఆ వ్యక్తి పెన్షన్ ఫండ్ సభ్యత్వం నుంచి వైదొలిగిన తేదీకంటే ముందు 60 నెలల సగటు వేతనం ఆధారంగా పెన్షన్‌బుల్ సేలరీ లెక్కింపు ఉంటుంది.