Emami | న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ..హీలియోస్ లైఫ్ైస్టెల్లో పూర్తిస్థాయి వాటాను కొనుగోలు చేసింది. ఇప్పటికే 50 శాతానికి పైగా వాటా కలిగివున్న ఇమామీ..తాజాగా 49.6 శాతం వాటాను హస్తగతం చేసుకున్నది.
దేశంలో అత్యధిక వేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్న వరుడు దుస్తుల విక్రయ విభాగంలో మరింత పట్టు సాధించాలనే ఉద్దేశంతో హీలియోస్‌ను కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది.
2017లో 33 శాతం వాటా కొనుగోలు చేసిన సంస్థ..ఆ తర్వాతి క్రమంలో ఈ వాటాను 50 శాతానికి పెంచుకున్నది. ప్రస్తుతం మిగతా వాటాను కొనుగోలు చేసింది. స్కిన్‌కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్ ఉత్పత్తులను ది మ్యాన్ కంపెనీ పేరుతో విక్రయిస్తున్నది.