Elon Musk | ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. లోగో మార్పుపై మస్క్
Elon Musk | ట్విట్టర్.. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బ్లూకలర్‌లో ఉండే బుల్లి పిట్ట (Blue Bird Logo)..! తాజాగా పిట్ట స్థానంలో క్రిప్టో కరెన్సీ (cryptocurrency) అయిన ‘డోజీ కాయిన్’ (Dogecoin)కు సంబంధించిన ‘డోజీ’ మీమ్ ( Doge Meme )ను ట్విట్టర్ లోగోగా మార్చిన విషయం తెలిసిందే.
Elon Musk | ట్విట్టర్.. ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బ్లూకలర్‌లో ఉండే బుల్లి పిట్ట (Blue Bird Logo)..! నీలిరంగులో ఉండే ఆ పిట్ట బొమ్మ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, తాజాగా పిట్ట స్థానంలో క్రిప్టో కరెన్సీ (cryptocurrency) అయిన ‘డోజీ కాయిన్’ (Dogecoin)కు సంబంధించిన ‘డోజీ’ మీమ్ ( Doge Meme )ను ట్విట్టర్ లోగోగా మార్చిన విషయం తెలిసిందే.
దీనిపై ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలన్ మస్క్ (Elon Musk) స్పందించారు. ట్విట్టర్ లోగోను మార్చేసినట్లు ధ్రువీకరించారు. ఇప్పుడు బ్లూ బర్డ్ (Blue Bird) పాతది అయిపోయిందని.. ఇకపై డోజీ మీమ్ ( Doge Meme ) ట్విట్టర్‌కు కొత్త లోగో (Twitter New Logo) అని వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకిలా..? అని అడగడం మొదలు పెట్టారు. నెటిజన్ల ప్రశ్నలకు మస్క్ స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారమే ట్విట్టర్ లోగో మార్చినట్లు స్పష్టం చేశారు.
2022 మార్చి 26న ఓ నెటిజన్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను మస్క్ ట్విట్టర్లో షేర్ చేశారు. అందులో నెటిజన్ ‘ట్విట్టర్‌ను కొనుగోలు చేసి.. ‘డోజీ’ని లోగోగా పెట్టండి’ అంటూ మస్క్‌కు ఓ సూచన చేశాడు. దీనికి మస్క్ సానుకూలంగా స్పందించారు. ఆ సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను మస్క్ ఈ సందర్భంగా షేర్ చేస్తూ.. ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా’ అంటూ పేర్కొన్నారు.
As promised pic.twitter.com/Jc1TnAqxAV
— Elon Musk (@elonmusk) April 3, 2023
Also Read..
Viral Video | స్కూటీని వెంబడించిన వీధి కుక్కలు.. ఆగి ఉన్న కారును ఢీకొన్న స్కూటీ
Avalanche | నాథు లా పర్వత శ్రేణులను ముంచెత్తిన భారీ అవలాంచ్.. ఆరుగురు మృతి
Samantha | శోభిత-నాగచైతన్య డేటింగ్‌పై సమంత కామెంట్లు వైరల్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

