న్యూయార్క్, నవంబర్ 7 : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. ట్రిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి కంపెనీ బోర్డుతోపాటు షేరు హోల్డర్లు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన ఏడాదికి ట్రిలియన్ డాలర్ల వేతనాన్ని అందుకోనున్నారు. ఇంతటి భారీ స్థాయిలో వేతనాన్ని అందుకోనున్న తొలి కార్పొరేట్ వ్యక్తి ఆయనే. వచ్చే పదేండ్లకాలంలో ఆయన 423.7 మిలియన్ల అదనపు షేర్లు పొందనున్నారు.
ఈ స్టాక్‌లు 12 విడుతలుగా పొందనున్నట్టు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం టెస్లా మార్కెట్ విలువ 8.5 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నది. కంపెనీ మార్కెట్ విలువ 500 బిలియన్ డాలర్లు పెరిగితే మస్క్‌కు మరొక శాతం వాటా లభించనున్నది.