Elon Musk xAI | ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో ఏఐ స్టార్టప్.. 14న వెలుగులోకి..!
Elon Musk xAI | బిలియనీర్ ఎలన్ మస్క్ సొంతంగా ఎక్స్ఏఐ అనే పేరుతో స్టార్టప్ ప్రారంభిస్తున్నారు.
Elon Musk xAI | ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అధిపతి, బిలియనీర్ ఎలన్ మస్క్ ఏం చేసినా స్పెషలే.. ఇప్పుడు టెక్ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్.. ప్రత్యేకించి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డెవలప్ మెంట్ పై ఫోకస్ చేస్తున్నాయి. అందులోనూ ఎలన్ మస్క్ పోటీ పడుతున్నారు.
ఎలన్ మస్క్ సొంతంగా ఏఐ స్టార్టప్ ప్రారంభిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్టార్టప్ ‘ఎక్స్ఎఐ’ అనే స్టార్టప్ సంస్థ, వెబ్ సైట్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం అల్ఫాబెట్ అనుబంధ గూగుల్, మైక్రోసాఫ్ట్ అనుబంధ ఓపెన్ ఏఐ మాజీ ఇంజినీర్లతో టీం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
చాట్ జీపీటీని తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ స్టార్టప్‌లో తొలుత పెట్టుబడులు పెట్టిన ఎలన్ మస్క్ తర్వాత వైదొలిగిన సంగతి తెలిసిందే. స్టార్టప్ సారధిగానూ ఎలన్ మస్క్ కొనసాగుతారు. ఈ నెల 14న ఎక్స్ఏఐ (xAI) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గత మార్చిలోనే ఎక్స్ఏఐ కార్పొరేషన్ పేరును ఎలన్ మస్క్ రిజిస్టర్ చేశారు. దీనికి ఎండీగా మస్క్ కుటుంబ కార్యాలయ కార్యదర్శిగా ఉన్న జారెడ్ బిర్చాల్ ఉంటారని తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

